FOR PREGNANT WOMEN....
గర్భధారణ అంటే భయాందోలనకు గురవుతున్నారా? కారణాలు ఇవే
గర్భధారణ అంటే భయపడడాన్ని "టోకోఫోబియా" అంటారు.- ఇది ఒక మానసిక పరిస్థితి.
- ఇది అన్ని ఇతర పరిస్థితుల మాదిరిగానే వాస్తవమైనది.
- టోకోఫోబియాతో బాధపడుతున్న స్త్రీలు పిల్లలకు జన్మనివ్వటానికి ఇష్టపడరు.
- గర్భం దాల్చడం అంటే సాధారణ భయంగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇదొక వైద్యపరిస్థితిగా చెప్పవచ్చు. విచిత్రంగా అన్పిస్తుందా? ఇలా జరుగుతుంది కూడా, కానీ గర్భధారణ అంటే కలిగే మానసిక భయం నిజమైనది మరియు దీనిని వైద్య పరిభాషలో 'టోకోఫోబియా' గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ముఖ్యంగా వ్యక్తిగత అనుభవాలు లేదా గర్భసమయంలో కలిగే బాధను ఊహించుకొని తీవ్రమైన భయందోలనకు గురవడం మూలంగా ఏర్పడవచ్చు
మునుపటి గర్భ సమయంలో ఎదురైనా అనుభవాల ఫలితంగా భయం ఏర్పడడం అనేది మహిళల్లో సర్వసాధారణం. అత్యంత బాధతో కూడిన సుఖ ప్రసవం లేదా సిజేరియన్ వంటి అనుభవాల గుండా వెళ్ళిన మహిళలు తీవ్రమైన భయాన్ని పెంపొందించుకుంటారు. అయితే అటువంటి బాధాకరమైన అనుభవాలు మళ్లీ అనుభవించాలనే ఆలోచననే వారు భరించలేరు. టోకోఫోబియా ఎక్కువగా బాధాకరమైన గర్భధారణ అనే దశను తాము భరించలేము కాబట్టి మాకు పిల్లలు కలుగడం సాధ్యం కాదని నమ్మే మహిళలలో ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment