చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని తగ్గిస్తాయి.
చలికాలంలో మసాలాలు
వేడి దుస్తువులు, గ్లోవ్స్, సాక్స్ మాత్రమే కాదు కొన్ని రకాల మసాలాలు కూడా చలిని తగ్గిస్తాయి. వీటిని మనం తినే ఆహార పదార్థాలలో కలుపుకోవటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంచటంతో పాటూ శరీరాన్ని వేడిగా ఉంచి, చలిని తగ్గిస్తాయి. కావున చలికాలంలో ఈ మసాలాలను వాడి చలిని తగ్గించుకోండి.
పచ్చిమిర్చి
చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా ఉన్నపుడు జలుబు వంటివి కలగవు. ఇలా మన శరీర ఉషోగ్రతలు స్థిరంగా ఉండాలంటే మనం తినే ఆహార పదార్థాలలో మిర్చి కలుపుకోండి. దీనిలో ఉండే క్యాప్ససిన్ అనే సమ్మేళనం శరీరానికి కావలిన వెచ్చదనాన్ని చేకూరుస్తుంది
పసుపు
భారతదేశపు ఇళ్ళలో ఉండే సాధారణ మసాలా దినుసుగా దీనిని పేర్కొనవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే పసుపు చలికాలంలో కలిగే ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని కూడా అందజేస్తుంది.
అల్లం
చలికాలంలో అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే అద్భుత ఔషదంగా అల్లంను పేర్కొనవచ్చు. చలికాలంలో కలిగే జలుబు, దగ్గు వంటి అన్ని రకాల సమస్యలను అల్లం తొలగిస్తుంది. దీనితో పాటుగా చలికాలంలో శరీరానికి కావలసిన వేడిని సమకూర్చతంతో పాటూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
జీలకర్ర
అన్ని రకాల వంటలలో వాడే ఈ రకం మసాలా దినుసులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి కావున చలికాలంలో వాడవచ్చు. చలికాలంలో వేడి మాత్రమే కాదు, జీర్ణక్రియను కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తుంది
No comments:
Post a Comment