Sunday, January 8, 2017

వీరే అష్టదిక్పాలకులు

వీరే అష్టదిక్పాలకులు
  తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం... ఇవే మన అష్టదిక్కులు. కొన్ని సందర్భాలలో వీటికి ఊర్ధ్వ, అధో దిక్కులను కలిపి దశదిక్కులుగా భావించేవారూ లేకపోలేదు. అష్టదిక్పాలకులకు మధ్యలో మరో దిక్కును ఉంచి నవదిక్పాలకులను పూజించిన సందర్భాలూ ఉన్నాయి. హిందువుల మత విశ్వాసంలో ఈ అష్టదిక్పాలకులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మన వాస్తు శాస్త్రమంతా ఈ అష్టదిక్కుల మీదే ఆధారపడి ఉంది. ఆయా దిక్కులకు అధిపతులైన దేవతల లక్షణాలకు అనుగుణంగా వాస్తులోని చాలా సూత్రాలు రూపొందింపబడి ఉన్నాయి. మన పురాతన ఆలయాలలోని పైకప్పుల మీద సైతం ఈ అష్టదిక్పాలకుల ప్రతిమలు ఉండటాన్ని గమనించవచ్చు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి తాము ప్రతినిధులం అన్న సూచనను బహుశా వీరు అందిస్తుంటారేమో! ఇలా ఎనిమిది దిక్కులకూ కూడా దేవతలకు పాలకులుగా భావించడం హిందూ ధర్మంలోనే కనిపిస్తుంది. వీరు వివరాలు ఇవిగో...

  
దిక్కుపాలకుడువాహనంఆయుధం
తూర్పుఇంద్రుడుఐరావతంవజ్రాయుధం
పడమరవరుణుడుమొసలిపాశము
ఉత్తరంకుబేరుడునరుడుగద
దక్షిణంయముడుమహిషముదండము
ఆగ్నేయంఅగ్నిమేషముశక్తి
నైరుతినిరుతిగుర్రముఖడ్గము
వాయువ్యంవాయువులేడిధ్వజము
ఈశాన్యంఈశ్వరుడుత్రిశూలంవృషభము
ఈ అష్టదిక్పాలకులకు చెందిన మంత్రాలను పూజించడం వలనా, వారికి సంబంధించిన యంత్రాలను ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. వీరినే కాకుండా కొందరు ఊర్ధ్వ దిక్కుకి బ్రహ్మనూ, అధో దిక్కుకు విష్ణువునూ పాలకులుగా భావిస్తుంటారు.

No comments:

Post a Comment