రావిచెట్టు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
భోది వృక్షం లేదా రావి చెట్టు హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా పరిగణిస్తుంటారు. మత ప్రాధాన్యత మాత్రమే కాకుండా, రావి చెట్టు ఆకులు చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
భోది వృక్షం లేదా రావి చెట్టు హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా పరిగణిస్తుంటారు. మత ప్రాధాన్యత మాత్రమే కాకుండా, రావి చెట్టు ఆకులు చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
1....
రావి చెట్టు: ది ట్రీ ఆఫ్ లైఫ్
హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా భావించే రావి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. ఈ వృక్షం మలబద్దకం, మధుమేహం మరియు చెవి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది
2....
మలబద్దకం నుండి ఉపశమనం
ఆకులను ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేయండి. ఈ పొడికి సోంపు విత్తనాలను, పచ్చి బ్రౌన్ పౌడర్ మరియు బెల్లంను సమాన మొత్తాలలో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటికి కలపండి. ఈ మిశ్రమాన్ని తాగటం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందుతారు
3....
మధుమేహ నిర్వహణలో సహాయం
భారతదేశం సహా అనేక దేశాలలో వేగంగా పెరుగుతున్న ముప్పుగా డయాబెటిస్ ను పేర్కొనవచ్చు. పురాతన కాలంలో మధుమేహా వ్యాధిని తగ్గించటానికి రావి చెట్టు సారాన్ని వాడే వారని అధ్యయనాలలో తెలిపారు. రావి చెట్టు నుండి సేకరించిన సారం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
4....
చెవి ఇన్ఫెక్షన్ లకు చికిత్సగా
రావి చెట్టు ఆకులతో చెవి ఇన్ఫెక్షన్ లను తగ్గించవచ్చు; చెట్టు ఆకు కింద మంటను ఉంచి, దాని నుండి వచ్చే రసాన్ని సేకరించండి. ఇలా వచ్చిన రసం చల్లారిన తరువాత, రెండు లేదా మూడు చుక్కలను చెవిలో వేసుకోండి. ఇలా చేయటం వలన చెవిలో ఉండే వివిధ ఇన్ఫెక్షన్ లు తగ్గిపోతాయి
5...
యాంటీ మైక్రోబియాల్ గుణాలు
యాంటీ మైక్రోబియాల్ గుణాల గురించి తెలుసుకోటానికి రావి చెట్టు ఆకుల సారాన్ని తీసుకొని పరీక్ష చేసారు. వీరు పరిశోధనలు జరిపి, బాసిల్లస్ సబ్టైలిస్, ఎస్చేరిచియాకోలి, స్టెపైలోకోకస్, కాండిడా అల్బికానా, ఫంగస్ నైజర్, సూడోమొనాస్ ఎరుగినోస వంటి బ్యాక్టీరియా మరియు ఫంగస్ లను నియంత్రిస్తుందని కనుగొన్నారు
No comments:
Post a Comment