వేయి చేతులతో రక్షించే దేవత... అవలోకితస్వర
ఓ దేవత. ఈ భూమ్మీద ఉన్న ప్రజలందరి కష్టాలూ చూసి ఆమె మనసు చలించిపోయేది. వారిని తాత్కాలికంగా ఆ కష్టాల నుంచీ, శాశ్వతంగా సంసారమనే వలయం నుంచి తప్పించాలని తపించిపోయేది. అందుకోసం ఆమెకు బుద్ధుడు వేయి చేతులను ప్రసాదించాడు. ఆపదలో కనిపించిన ప్రతి మనిషినీ రక్షించే శక్తిని ప్రసాదించాడు. ఆ దేవత పేరే ‘అవలోకితస్వర’... అంటే ‘మన ఆర్తనాదాలను వినే దేవత’ అని సంస్కృతంలో అర్థం. ఆ పేరు క్రమంగా అవలోకితేశ్వరగా మారిపోయింది.
మనం తరచూ బౌద్ధానికి సంబంధమైన నృత్యాలను, చిత్రాలను చూసినప్పుడు గుయాన్‌ఇన్ కనిపిస్తూనే ఉంటుంది. మనిషి వెనుక మనిషి నిల్చిని వందలాది చేతులను చాచి చేసే ప్రదర్శన గుయాన్ ఇన్ గురించే! బుద్ధుని పక్కనే తాండవం చేస్తున్నట్లు కనిపించే స్త్రీమూర్తి చిత్రం గుయాన్ఇన్‌దే! అదీ ఇదీ అని ఏముంది. మనల్ని చల్లగా కాచుకునేందుకు ఓ తల్లి ఉందన్న నమ్మకానికి ప్రతిరూపమే గుయాన్‌ఇన్ లేదా అవలోకితేశ్వర. అందుకే ఒకప్పుడు జపాన్‌లోని నియంతలు క్రైస్తవాన్ని నిషేధించినప్పుడు, అక్కడి క్రైస్తవులు అవలోకితేశ్వర రూపంలో మేరీమాతను కొల్చుకునేవారట. అమ్మ ఎవరికైనా అమ్మే కదా!

తొలుత బౌద్ధంలో దేవతల ప్రస్తావన తక్కువ. కానీ హిందూధర్మంతో ఉన్న అనుబంధం వల్లనో, లేక వారి స్వీయ అనుభవాల వల్లనో దేవతారాధన అనేది బౌద్ధంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా వజ్రయానం, మహాయానం వంటి బౌద్ధ శాఖలలో దేవతార్చనకు, ఆరాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. అలా బౌద్ధులు కొలిచిన ముఖ్యదేవతలలో ఒకరు అవలోకితేశ్వర. మహాయానం కోసం సంస్కృతంలో రూపొందించిన ‘సద్ధర్మ పుండరీక సూత్రాలు’ అనే పుస్తకంలో అవలోకితేశ్వరుని ప్రసక్తి చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఒకప్పుడు అవలోకితేశ్వర ఆరాధన చాలా విస్తృతంగా ఉండేది. 12వ శతాబ్దానికి ముందర ఎక్కడ చూసినా ఆయన గుడులూ, విగ్రహాలు విస్తృతంగా కనిపించేవి. రాజమందిరాలు మొదల్కొని రహదారుల వరకూ ఎక్కడ చూసినా శుభసూచకంగా ఈ విగ్రహాలు దర్శనమిచ్చేవి. కానీ 12వ శతాబ్దంలో అన్యమతస్తులు చేసిన దండయాత్రల తరువాత ఇవి కనుమరగు కావడం మొదలుపెట్టాయి. క్రమేపీ మన దేశంలో బౌద్ధం క్షీణించడంతో పాటుగా అవలోకితేశ్వర అన్న మాటనే జనం మర్చిపోయారు. కానీ బౌద్ధ మతం విస్తరించిన ఇతర ప్రదేశాలలో ఈ దేవత పేరు, రూపం పలురకాలుగా పూజలనందుకోవడం మొదలుపెట్టింది. చైనీయులు అవలోకితేశ్వరుని, ‘గుయాన్ ఇన్’గా పిలుచుకోసాగారు.
చైనీయుల దృష్టిలో ‘గుయాన్ ఇన్’ జాలి, కరుణలకు ప్రతిరూపం. సంతానం లేనివారికి పుత్రభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. సంతానాన్ని అందించడమే కాదు, ఆ బిడ్డలను పెంచడంలో తలమునకలై ఉండే తల్లులకు తోడుగా నిలుస్తుంది. సముద్రం మీదకు వెళ్లే నావికులకు దారి చూపిస్తుంది. అదీ ఇదీ అని ఏముంది? ఎవరికి ఏ ఆపద కలిగినా, ఎలాంటి బాధ మెలిగినా... వెన్నంటి నిలుస్తుంది. ఆపదల నుంచి గట్టెక్కించడమే కాదు, కర్మఫలం నుంచి కూడా తప్పిస్తుంది. కిరీటం మీద బుద్ధుని ప్రతిమతో, పక్కనే తెల్లటి చిలుకతో, డ్రాగన్ మీద ఠీవిగా నిల్చొని ఉన్న ‘గుయాన్ ఇన్’ ప్రతిమలు చైనా అంతటా కనిపిస్తాయి. అయితే గుయాన్ ఇన్‌కు ఒక ప్రత్యేకమైన ప్రతిరూపం అంటూ లేదు. భక్తులను రక్షించేందుకు ఆమె ఏ రూపాన్నైనా ధరిస్తుంది. అందుకే ఆమెను కొందరు యువకునిగాను, మరికొందరు స్త్రీమూర్తిగానూ పూజిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, కష్టాన్ని బట్టి ఆమెను వివిధ రూపాలలోను, రకరకాల పేర్లతోను పిలుచుకుంటారు. జపాన్‌లో కనోన్ అనీ, టిబెట్‌లో చెన్‌రెజిక్ అనీ... ‘గుయాన్ ఇన్’కు ఒకో దేశంలో ఒకో పేరు, ఒకో రూపు ఉంటుంది.